మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు  నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ట్యాంపరింగ్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మంత్రితో పాటు ఐఏఎస్ అధికారులపై కేసులు పెట్టాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులపై కూడా కేసులు పెట్టాలని ఆదేశించింది కోర్టు. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పంచుకోవద్దని సూచించింది. 

2018 ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రాఘవేంద్ర రాజు. అయితే ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు.  అయితే  తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలన్న మంత్రి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మంత్రిపై వేసిన మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను విచారణకు అనుమతించింది. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు మంత్రి వాదనను తిరస్కరిస్తూ,  రాఘవేంద్ర రాజు పిటిషన్ ను విచారణకు అనుమతి ఇచ్చింది.