
సూపర్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తోన్నలేటెస్ట్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ఇప్పటికే ప్రీమియర్స్, బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్స్ ప్రత్యేకంగా ఉన్నాయని విషయం తెలిసిందే. ఇక మరొక కొత్త విషయం ఏంటంటే..గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే లేడి సూపర్ ఫ్యాన్స్ కోసం..మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు.
ఈ మూవీ కోసం ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా..నమ్రత విజయవాడ గాంధీనగర్‌లోని రాజ్ థియేటర్‌లో జనవరి 12న గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు నమ్రత తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కేవళం మహిళలకు మాత్రమే. సూపర్ మహేష్ లేడీ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంటూ నమ్రత ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.