Balakrishna: నా మనవళ్ళు ‘తాతా’ అని పిలిస్తే.. వారి తాట ఒలుస్తా.. హీరో బాలకృష్ణ స్పీచ్ వైరల్

Balakrishna: నా మనవళ్ళు ‘తాతా’ అని పిలిస్తే.. వారి తాట ఒలుస్తా.. హీరో బాలకృష్ణ స్పీచ్ వైరల్

యాభై ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న హీరోగా బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌ (గోల్డ్‌‌ ఎడిషన్‌‌ )లో స్థానం సంపాదించారు. శనివారం హైదరాబాద్‌‌లో జరిగిన వేడుకలో బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్‌‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్యకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలకు గర్వకారణమని, 65 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా కనిపించే బాలయ్య.. మరో 35 ఏళ్లు మరింత జోష్‌‌తో రాణించాలని బండి సంజయ్‌‌ ఆకాంక్షించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.

అందరి సహాయ సహకారాలతోనే నేను ఇంతటి వాడినయ్యా. కోట్లాదిమంది అభిమానులను పొందడం జన్మజన్మల అనుబంధంగా ఫీలవుతాను. తెలుగు సినిమా సత్తా పాన్ వరల్డ్‌‌ స్థాయికి వెళ్లడం మనందరికీ గర్వకారణం. నాకు ఈ గుర్తింపును ఇచ్చిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు. ఈ గుర్తింపుతో నాపై మరింత బాధ్యత పెరిగింది’ అని అన్నారు.

వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం ఇటీవల  జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వచ్చిన భారీ వర్షాలకు అతలాకుతలమైన రైతులకు భరోసాగా తనవంతు సాయంగా రూ.యాభై లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు అనౌన్స్ చేశారు బాలకృష్ణ.  మున్ముందు మరిన్ని సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.

”నా రికార్డ్స్ నాకు తెలియవు.. గుర్తుండవు కూడా. అంకెలతో సంబంధం లేని ప్రయాణం నాది. ఇప్పటికీ ఎన్ని సినిమాలు చేశానో కూడా సరిగ్గా తెలియదని అన్నారు బాలకృష్ణ.

నా సినిమాలు సృష్టించిన రికార్డులు, అవి ఎన్ని రోజులు నడిచాయో నాకు గుర్తులేదు. అభిమానులు మాత్రమే ఆ వివరాలను గుర్తుంచుకుంటారు. అలా వయస్సు విషయంలో కూడా నా మనవళ్ళతో ఎప్పుడు గొడవే ఉంటుందని, అందుకే.. నన్ను'బాలా' అని పిలుస్తారు. ఒకవేళ తాతా అని పిలిస్తే వారి తాట తీస్తా” అని (నవ్వుతూ) సరదా జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

ఈ వేడుకలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నటి జయసుధ, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రీ నవీన్, ఏషియన్ సునీల్, రామ్ఆచంట, గోపీ ఆచంట, భరత్ భూషణ్, నాగవంశీ, దర్శకులు బోయపాటి శీను, గోపీచంద్ మలినేని, బాబీ, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.