బాలయ్య,గోపిచంద్ కొత్త మూవీ ప్రారంభం

బాలయ్య,గోపిచంద్ కొత్త మూవీ ప్రారంభం

‘‘చరిత్రలో చాలామంది ఉంటారు.. కానీ చరిత్రను మరల మరల తిరగరాసి కొత్త చరిత్రను సృష్టించేవాడు ఒక్కడే.. నాదే ఆ చరిత్ర..” అంటున్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ఫస్ట్ షాట్‌‌‌‌ కోసం బాలయ్య ఈ డైలాగ్ చెప్పారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌‌‌‌. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌‌‌‌లో ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్‌‌‌‌గా జరిగింది. 

ముహూర్తపు షాట్‌‌‌‌కు దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య చిన్నకూతురు తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు ఫస్ట్ షాట్‌‌‌‌ డైరెక్ట్ చేశారు.  ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్  స్క్రిప్ట్‌‌‌‌ను నిర్మాతలకు అందజేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో బాలకృష్ణ చేతిలో ఖడ్గం, పొడవాటి గడ్డంతో యోధుడిగా రెండు డిఫరెంట్‌‌‌‌ గెటప్స్‌‌‌‌లో కనిపించారు.