ఎయిటీస్‌లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన నందమూరి కల్యాణ్ చక్రవర్తి.. 36 ఏళ్ల తర్వాత కమ్ బ్యాక్ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘లంకేశ్వరుడు’ సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిన తర్వాత ఆయన సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ‘చాంపియన్’ చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టీమ్ ప్రకటించింది.
ఈ కథ, అందులోని ఆయన పాత్రకు ఉన్న డెప్త్ కల్యాణ్ చక్రవర్తిని ఇంప్రెస్ చేశాయని అందుకే ఇందులో నటించారని చెప్పారు. ఈ చిత్రంలో ఆయన కథకు కీలకమైన రాజి రెడ్డి పాత్రలో కనిపిస్తారని రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో గ్రే హెయిర్, స్టన్నింగ్ ఎక్స్‌ప్రెషన్‌తో, ఇంటెన్స్ గెటప్‌లో ఆకట్టుకున్నారాయన.
బ్యాక్‌డ్రాప్‌లో ఉత్సాహభరితమైన వేడుక కథలోని కీలకమైన మూమెంట్‌ను సూచిస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది.
