రివ్యూ: నాంది

రివ్యూ: నాంది

రన్ టైమ్ : 2 గంటల 25 నిమిషాలు

నటీనటులు: అల్లరి నరేష్,నవమి,వరలక్ష్మీ శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్, దేవీ ప్రసాద్,ప్రియదర్శి,వినయ్ వర్మ, ప్రవీణ్,శ్రీకాంత్ ఐయ్యర్

సినిమాటోగ్రఫీ: సిధ్

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

నిర్మాత: సతీష్ వేగేశ్న

రచన,దర్శకత్వం: విజయ్ కనకమేడల

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 19,2021

కథేంటి?

సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్) ఓ సాఫ్ వేర్ ఉద్యోగి. ఫ్యామిలీ తో హ్యాపీ గా ఉంటాడు. పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది.అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో సడెన్ గా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఓ మర్డర్ కేసులో నిందితుడని అక్రమంగా కేసు బనాయిస్తారు. ఇంతకు అతన్ని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఆ మర్డర్ చేసింది ఎవరు? చివరికి తను నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

నరేష్ మంచి నటుడు.కామెడీ రోల్సే కాకుండా సీరియస్ రోల్స్ కూడా చాలా బాగా చేస్తాడనేదానికి ఈ మూవీ మరో ఉదాహరణ. తన కెరీర్ లో కలికుతురాయి గా నిలిచిపోతుంది. టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.ఇలాంటి మంచి రోల్స్ సెలక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో పేరొస్తుంది.వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటెన్స్ నటనతో ఆకట్టుకుంది.హరీష్ ఉత్తమన్ విలనీ పోలీసాఫీసర్ పాత్రలో రాణించాడు. దేవీ ప్రసాద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. హీరోయిన్ నవమికి పెద్దగా స్కోప్ లేదు. వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యర్ బాగా చేశారు.

టెక్నికల్ వర్క్:

సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది.కొన్ని సీన్లను చాలా రిచ్ గా చూపించాడు. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన పాటలు వినసొంపుగా లేవుకానీ….బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజయ్ కనకమేడల రాసుకున్న డైలాగులు బాగున్నాయి.అతను  ఈ సెక్షన్ గురించి చేసిన డిటెయిలింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండాల్సింది.

విశ్లేషణ:

‘‘నాంది’’ డిఫరెంట్ సబ్జెక్ట్.న్యాయ వ్యవస్థ,పోలీసు వ్యవస్థలో ఉన్న లొసుగులను కళ్లకు కట్టినట్టు చూపించారు.కేసుల పేరుతో అమాయకులను పోలీసులు ఏ విధంగా హింసిస్తారో ఇందులో చూపించారు.అలాంటి వాళ్లు న్యాయం కోసం సెక్షన్ 211 ను ఏవిధంగా వాడుకోవచ్చో ఈ చిత్రం చెప్తుంది. కొత్త డైరెక్టరే అయినా విజయ్ కనకమేడల బాగానే హ్యాండిల్ చేశాడు.మొదటి సినిమాతోనే సీరియస్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకొని కొత్తగా ఆలోచిస్తాను అని చెప్పాడు. పాయింట్ ను మేజర్ పార్ట్ వరకు బాగానే హ్యాండిల్ చేసినా అక్కడక్కడా కాస్త బోర్ కొట్టించాడు.కొన్ని సీన్లు లాజిక్ కు దూరంగా తీసాడు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు నచ్చకపోవచ్చు. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు మాత్రం నచ్చుతుంది. స్టార్టింగ్ లో ఒక 20 నిమిషాలు విసిగించినా.. మెయిన్ పాయింట్ కు వచ్చేసరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. సెకండాఫ్ మొదలయ్యాక కాస్త నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ సాగతీత గా ఉంది. ఓవరాల్ గా రొటీన్ కామెడీ సినిమాలతో బోర్ కొట్టించిన నరేష్ ఈ మూవీ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొత్తదనం కోరుకునేవాళ్లు ఓ సారి ట్రై చేయవచ్చు.

బాటమ్ లైన్: కొత్తదనానికి నాంది పలికిన నరేష్