మల్కాజిగిరిలో పోటీకి సిద్ధం..బీఆర్ఎస్ ​చాన్స్ ​ఇవ్వాలి

 మల్కాజిగిరిలో పోటీకి సిద్ధం..బీఆర్ఎస్ ​చాన్స్  ​ఇవ్వాలి

అల్వాల్: మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీ రెండు టికెట్లు కేటాయించడం, బీసీ నాయకుడైన తనను చిన్నచూపు చూడడం మూలంగానే పార్టీని వీడినట్లు నందికంటి శ్రీధర్ తెలిపారు. ఇటీవల అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి ఇష్టారీతిగా టికెట్లను కేటాయించడం మూలంగానే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చిందని అన్నారు. 

కేటీఆర్ సమక్షంలో మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఏడు డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులతో బీఆర్ఎస్​లో చేరినట్లు అని తెలిపారు. 
అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజిగిరిలో పోటీ చేసేందుకు సిద్ధమని శ్రీధర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్​పార్టీకి కట్టుబడి ఉంటానని అన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. 

బీఆర్ఎస్​మల్కాజిగిరి టికెట్ ఎవరికి కేటాయించినా సమష్టిగా పనిచేసి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు తనను, తన క్యాడర్ ను అనేకసార్లు ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 34 మందికి బీసీలకు టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటకు కట్టుబడి లేనందున పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు