ఆసక్తి రేపేలా వధువు వెబ్ సిరీస్

ఆసక్తి రేపేలా వధువు వెబ్ సిరీస్

అవికా గోర్, నందు, అలీ రెజా లీడ్ రోల్స్‌‌లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ మెహ్తా, మహేంద్ర సోని నిర్మించారు. శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్‌‌ హాట్‌‌ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో నందు మాట్లాడుతూ ‘ఒక కుటుంబ సభ్యులంతా చాలా డిఫరెంట్‌‌గా ఉంటారు. వాళ్లు అంత అనుమానాస్పదంగా ఎందుకు ఉన్నారనేది ఆసక్తి కలిగిస్తుంది.

సీజన్ 2 ఇంకా బిగ్గర్ కాన్వాస్‌‌లో ఉంటుంది’ అన్నాడు. అలీ రెజా మాట్లాడుతూ ‘ఇందులో నా నటన చాలా సెటిల్డ్‌‌గా ఉంటుంది. కచ్చితంగా హిట్ అవుతుంది’ అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందు అనే బెంగాలీ వెబ్‌‌ సిరీస్‌‌కు ఇది రీమేక్. అయితే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశాం. ఆ తేడా కనిపిస్తుంది. అవికతో పాటు ప్రేక్షకులను కూడా తన అత్తవారింటికి తీసుకెళ్తాం. అంత గ్రిప్పింగ్‌‌గా ఉంటుంది’ అన్నారు. నటి రూప, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి, ఎడిటర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.