సంచలన కేసులో కిడ్నాపర్లు అరెస్ట్ : రూ.3 కోట్లు రికవరీ.. కోటి వాడేశారు

సంచలన కేసులో కిడ్నాపర్లు అరెస్ట్ : రూ.3 కోట్లు రికవరీ.. కోటి వాడేశారు

నంద్యాల జిల్లాలో ఓ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసి నాలుగు కోట్లు దోచుకున్న కేసులో 15 మందిని అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి మూడు కోట్ల నగదును సీజ్ చేశారు. . ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.

‌నంద్యాల జిల్లాలో ఓ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసి నాలుగు కోట్లు దోచుకున్న కేసులో 15 మందిని అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి మూడు కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్టు చేసి కిడ్నాప్ చేసి దోచుకున్న డబ్బులను రికవరీ చెయ్యడంతో పాటు ముద్దాయిలను కటకటాల పాలు చేసి శభాష్ అనిపించుకున్నారు.

నంద్యాల జిల్లాలో అత్యంత సంచలన సృష్టించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.  బనగానపల్లెకు చెందిన CH నాగిరెడ్డి అనే వ్యక్తి బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌ లో2023  జూన్ 5వ తేదీ ఉదయం తన కొడుకు వినాయక రెడ్డి, తన మనవడు భరత్ కుమార్ రెడ్డి తన డ్రైవరు సాయినాథ్ రెడ్డి ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, రూ.4 కోట్లు డిమాండ్ చేశారంటూ జూన్ 7వ తేదీన కేసు పెట్టాడు. కిడ్నాపర్స్ కి భయపడిన నాగి రెడ్డి తనకు తెలిసిన వారి వద్ద నుంచి రూ.4 కోట్లు డబ్బులు తీసుకొని తన మేనల్లుడైన శంకర్ రెడ్డి ద్వారా రెండు విడతలుగా కిడ్నాపర్స్‌కు అందజేసినట్లు ఫిర్యాదులో తెలిపాడు.

బాదితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం నాలుగు బృందాలుగా కిడ్నాపర్స్ కోసం ముమ్మరంగా గాలించారు. పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనంతపురం, బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగుళూరు, కోలార్, మైసూరు, తుమ్కూర్, మొదలగు ప్రదేశాలలో కిడ్నాపర్స్ కోసం వెతికారు. 

గుత్తి మండల బాట సుంకులమ్మ గుడి వద్ద సురేశ్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని అతని సహాయంతో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలము, కోన మల్లికార్జున స్వామి గుడికి వెళ్లే దారిలో  కర్నాటకకు  చెందిన శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, GN రంజిత్ కుమార్, ఏపీలోని అనంతపురం జిల్లాకి చెందిన రవి కుమార్, రంజిత్ కుమార్ లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి  3 కోట్ల రూపాయిలతో సహా కిడ్నాప్ నకు ఉపయోగించిన నాలుగు కార్లు, మూడు సెల్ ఫోన్లు, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు