OG డైరెక్టర్ క్రేజీ ప్లాన్: ప్రభాస్, పవన్ తర్వాత నానితో.. బ్యాక్‌డ్రాప్‌, టైటిల్ రివీల్!

OG డైరెక్టర్ క్రేజీ ప్లాన్: ప్రభాస్, పవన్ తర్వాత నానితో.. బ్యాక్‌డ్రాప్‌, టైటిల్ రివీల్!

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోగా చేస్తూనే, మరోవైపు నిర్మాతగా విజయవంతగా రాణిస్తున్నారు. హీరోగా.. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్లో పెట్టేశారు నాని. అందులో ఫస్ట్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.

ఇప్పటికే, ది ప్యారడైజ్ నుంచి రిలీజైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇది అలోమోస్ట్ ఇండస్ట్రీ సూపర్ హిట్ అవుతుందనే బలమైన సంకేతాలు సైతం తీసుకొచ్చింది. అందుకు ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తీసుకొచ్చిన కంటెంట్. చూపించిన విజువల్స్.

కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఒక జాతి కథ అంటూ ఇచ్చిపడేసేలా వీడియో రిలీజ్ చేసి షేక్ చేసిశాడు శ్రీకాంత్. ఇపుడు నాని నెక్స్ట్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ రివీల్ అయింది. అదేనండీ ఆగిపోయింది అనుకున్న సుజీత్ కాంబో!

ఓజీ మూవీ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) తో నాని తన 32వ సినిమాను మొదలుపెట్టేశాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అందరూ అనుకున్నారు.

కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ కాంబో ఉంటుందని టాక్. OG త‌ర్వాత సుజీత్ తెరకెక్కించే సినిమా నానిదే అని సమాచారం. ఈ మూవీ యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా రానుందని టాక్. అలోమోస్ట్ స్క్రిప్ట్ పనులు కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

►ALSO READ | Su From So OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్..

ఇందులో భాగంగా వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరిలో మూవీ సెట్స్కు వెళ్లనుందట. ఇకపోతే ఈ సినిమాకు బ్లడీ రోమియో (BloodyRomeo) అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల టాక్. ప్రస్తుతం ఓజీ రిలీజ్ పనుల్లో సుజీత్ బిజీగా గడుపుతున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత నాని మూవీ పనుల్లో బిజీ అవ్వనున్నారు సుజీత్. త్వరలో నాని-సుజీత్ మూవీపై మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

డైరెక్టర్ సుజీత్ తన రెండో సినిమానే ప్రభాస్ (సాహూ)తో తీసి క్రేజీ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పవన్తో వస్తూ తన గ్యాంగ్ స్టర్ సిగ్నేచర్ని పరిచయం చేయనున్నాడు. ఇక నానితో ఎలాంటి సత్తా చాటునున్నాడో అనే ఆసక్తి నెలకొంది.