
అమరావతి, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మరోసారి తడబడ్డారు. ఏప్రిల్ 9న అందరూ ఓటెయ్యం డని చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల తేదీని తప్పుగా పలికి తర్వాత సరి చేసుకున్నారు. “నేను ఇక్కడే ఉండవల్లిలో అందుబాటులో ఉంటా. అహర్నిశలూ కష్టపడి మీ సమస్యలను పరిష్కరిస్తా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలా కాదు. నేను అన్ని గ్రామాలూ తిరుగుతా. ఇప్పుడు ఎన్ని కలు వస్తున్నాయి . ఏప్రిల్ తొమ్మిదో తారీఖు పోలింగ్. ఆశీర్వదించండి, దీవించండి” అని అన్నారు. వెంటనే ఏప్రిల్ 11న పోలింగ్, 9న ఎన్ని కల ప్రచారం ముగుస్తుం దని తప్పును సరి చేసుకున్నారు. ఇటీవల వైఎస్ వివేకా హత్య ఘటనపై మాట్లాడుతూ..పాపం వివేకానందరెడ్డి చనిపోయారు.. మేము ఎంతో పరవశించాం ” అని ఆయన తడబడిన సంగతి తెలిసిందే.