చిరంజీవి సినిమాలో నారా రోహిత్?

చిరంజీవి సినిమాలో నారా రోహిత్?

కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో  తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు నారా రోహిత్. పలువురు స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్ర పోషించిన ఆయన.. ఈసారి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు ఎంపిక అయినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే వెంకటేష్​ హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు రోహిత్. ఇప్పటికే ఆయనకు సంబంధించిన సీన్స్ షూట్ చేసినట్టు సమాచారం. 

తాజాగా మరో మెగా ఆఫర్ అందుకున్నాడట నారా రోహిత్.  చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ  తను కీలక పాత్రలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.  కథలో కీలక మలుపు తీసుకువచ్చే ఒక పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్ కోసం దర్శకుడు బాబీ తనను  సంప్రదించాడట. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కథకు బలమైన ఇంపాక్ట్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ నటిస్తుండగా, ఆమెకు జంటగా మెగాస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్లుడి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నారా రోహిత్ కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. తన ఎంట్రీపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా పూజా  కార్యక్రమాలతో  షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట్ కె నారాయణ  నిర్మిస్తున్నారు.