వినాయక చవితికి నారా రోహిత్ సుందరకాండ

వినాయక చవితికి నారా రోహిత్ సుందరకాండ

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుందరకాండ’.   వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  సందీప్ పిక్చర్ ప్యాలెస్  బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.  శుక్రవారం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 27న వినాయక చవితి  కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  

బుధవారం విడుదలతో ఈ చిత్రానికి  లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని టీమ్ భావిస్తోంది. ఇక  రిలీజ్ డేట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నారా రోహిత్ ప్లెజెంట్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. తను హీరోగా నటిస్తోన్న 20వ చిత్రమిది. విర్తి వాఘాని,  శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా, నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.