నారా రోహిత్ సుందరకాండ మూవీ ట్రైలర్ రిలీజ్

నారా రోహిత్ సుందరకాండ మూవీ ట్రైలర్ రిలీజ్

నారా రోహిత్ హీరోగా  నటించిన చిత్రం ‘సుందరకాండ’.  వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  శ్రీదేవి విజయ్ కుమార్,  విర్తి వాఘాని  హీరోయిన్స్‌‌. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను ప్రభాస్  రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ట్రైలర్ విషయానికొస్తే..  తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటాడు నారా రోహిత్. అలాంటి అమ్మాయి కోసం ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తుంటాడు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రం   ఎలా అయినా తన పెళ్లి చేయాలనుకుంటారు. 

అలాంటి సందర్భంలో ఒకేసారి తన లైఫ్‌‌లోకి  ఇద్దరు అమ్మాయిలు  వస్తే.. వారిని ఎలా హ్యాండిల్ చేశాడనేది కథ.  ‘అయితే పెద్దోళ్లను లవ్ చేస్తావు.. లేదంటే చిన్నోళ్లను లవ్ చేస్తావు.. నీ ఏజ్ వాళ్లు దొరకరా’ అని సత్య చెప్పిన డైలాగ్ ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంది.  వాసుకి ఆనంద్,  నరేష్, సత్య, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో కనిపించారు. లియోన్ జేమ్స్ అందించిన  బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది.  సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ చిత్రం  ఆగస్టు 27న విడుదల కానుంది.