వాన వెలిసి 15 రోజులైనా.. ఓఆర్ఆర్​పై నీళ్లు పోలే!

వాన వెలిసి 15 రోజులైనా.. ఓఆర్ఆర్​పై నీళ్లు పోలే!

15 రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు చిన్నగోల్కొండ గ్రామంలోని నరసింహ చెరువు పూర్తిగా నిండింది. ఆ టైంలో చెరువు తూములు తెరవకపోవడంతో బ్యాక్ ​వాటర్​ ఓఆర్ఆర్ సర్వీస్​రోడ్డుతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలను ముంచెత్తింది. అయితే ఇప్పటికీ ఆ నీళ్లు అలానే ఉన్నాయి. పెద్ద గోల్కొండ వద్ద ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.15 చెరువును తలపిస్తోంది. ఇక్కడ నీళ్లు తొలగకపోవడంతో దాదాపు 60 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్​అయ్యాయి. శంషాబాద్ నుంచి బహదూర్ గూడ మీదుగా తుక్కుగూడ వెళ్లే దారిలో ఉన్న టోల్ గేట్, తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్లే దారిలోని టోల్​గేట్, ట్రోమా సెంటర్ ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి. దీంతో 60 గ్రామాల ప్రజలు వన్​వే అయిన నరసింహ చెరువు కట్టపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం ఉదయం కృష్ణవేణి అనే స్కూల్ బస్సు కట్టపై నుంచి వెళ్తూ మట్టిలో దిగబడింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సులోని స్టూడెంట్లను కిందకి దింపేశాడు. ఆ టైంలో బస్సులో 45 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపు తప్పి చెరువులో పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఓఆర్ఆర్ పై నిలిచిన వరద నీటిని తొలగించాలని, చెరువు తూములు తెరవాలని కోరుతున్నారు. - వెలుగు, శంషాబాద్