హైకోర్టులో ఏఎస్‌‌జీగా నరసింహ శర్మ

హైకోర్టులో ఏఎస్‌‌జీగా నరసింహ శర్మ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున కేసుల్ని వాదించేందుకు అడిషనల్‌‌ సొలిసిటర్‌‌ జనరల్‌‌(ఏఎస్‌‌జీ)గా సీనియర్‌‌ అడ్వొకేట్‌‌ బి.నరసింహ శర్మను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నరసింహ శర్మ 1959 నవంబర్‌‌ 22న పుట్టారు. 

ఓయూలో ఎల్‌‌ఎల్‌‌ఎం చేసి గోల్డ్‌‌మెడల్‌‌ సాధించారు. లాయర్‌‌గా 1982లో ఎన్‌‌రోల్‌‌ అయ్యారు. 2022లో సీనియర్‌‌ అడ్వకేట్‌‌ అయ్యారు. ఐటీ, కేంద్ర పన్నులు, కస్టమ్స్‌‌ అండ్‌‌ డైరెక్టరేట్‌‌ ఆఫ్‌‌ రెవెన్యూ ఇంటెలీజెన్స్‌‌(డీఆర్‌‌ఐ), డీసీసీఐ, ఈడీ, నార్కోటిక్‌‌ కంట్రోల్‌‌ బ్యూరో, యూనియన్‌‌ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్, కంప్ట్రోలర్‌‌ అండ్‌‌ ఆడిటర్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ ఇండియా, బీఎస్‌‌ఎన్‌‌ఎల్, కేంద్రీయ విద్యాలయంలకు న్యాయవాదిగా చేశారు. ఏఎస్‌‌జీ పదవిలో 3 ఏండ్లు ఉంటారు.