
ఇబ్రహీంపట్నం : నిలదీసినందుకు అన్యాయంగా విద్యార్థులను స్కూల్ నుంచి తరిమేశారు. ఆహారం బాగాలేదు అని అడిగినందుకు 30 మంది విద్యార్థులను ఇంటి దగ్గర వదిలేసింది ఆదిబట్ల రావిరాల నారాయణ జూనియర్ కాలేజీ యాజమాన్యం. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 1లక్ష 80 వేలు ఫీజ్ తీసుకొని సరైన భోజనం పెట్టలేదని సీరియస్ అయ్యారు నారాయణ కాలేజ్ స్టూడెంట్స్. ఈ సంఘటనపై మండిపడ్డుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. లక్షల ఫీజులు కట్టినప్పుడు సరైన ఫుడ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.