 
                                    హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయడానికి ‘మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్– సీజన్ 6’ కార్యక్రమాన్ని నారాయణ స్కూల్స్ విజయవంతంగా నిర్వహించింది. ఈ కాంటెస్ట్ జులై నుంచి అక్టోబర్ వరకు తెలంగాణలోని అన్ని నారాయణ స్కూల్స్ లో నిర్వహించారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ మాట్లాడారు.
నారాయణ స్కూల్స్ లోని ప్రతి విద్యార్థి తన గొంతును ధైర్యంగా వినిపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ కేవలం ప్రసంగం గురించి మాత్రమే కాదని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక సృజనాత్మక ప్రయాణమని అభివర్ణించారు. అనంతరం విద్యాసంస్థల మరో డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడారు. చదువుతో పాటు విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు అందించడం నారయణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

 
         
                     
                     
                    