నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు

నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు
  • ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన హైకమాండ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చింది. గతంలో మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్ కు టికెట్ కేటాయించగా.. తాజాగా సంజీవరెడ్డి పేరును ప్రకటించింది. సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన అధిష్ఠానం.. సురేశ్ కు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు, గాంధీ భవన్ సిబ్బంది బీ ఫామ్ ఇవ్వడానికి సంజీవ రెడ్డి వద్దకు వెళ్లారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. తుది రోజు వెయ్యికిపైగా  నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు 2,474 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తుది రోజు రిటర్నింగ్ అధికారి ఆఫీసుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థిని మార్చి శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో నీలం మధు ఉదయం ఫార్వార్డ్ బ్లాక్ లో చేరారు. మధ్యాహ్నం బీఎస్పీలో కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎదురు పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.