హైదరాబాద్, వెలుగు: నిర్మాణరంగం కోసం ప్రతిభావంతులను తయారు చేయడానికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) తెలంగాణ, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ) ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను, కోర్సులను రూపొందించడం ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం.
హైదరాబాద్ ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్లో వేగంగా ఎదుగుతోందని నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు గల నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
