అసోంలో అమిత్ షా పర్యటన

 అసోంలో అమిత్ షా పర్యటన

2014 కంటే ముందు ఈశాన్య రాష్ట్రాలంటే కేవలం పర్యాటక ప్రాంతాలుగానే గుర్తించేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక.. ఈశాన్య రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఇవాళ అమిత్ షా అసోంలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి చేరుకున్న షాకు ఘనస్వాగతం లభించింది. దారిపొడవునా ఆయనకు ప్రజలు అభివాదం చేశారు. ఆ తర్వాత అసోం రాజ్ భవన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

అనంతరం గ్యాంగ్ టక్ లోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల కో ఆపరేటివ్ డైరీ కాంక్లేవ్ లో అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం.. దాదాపు 65 వేలకు పైగా ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఐదేండ్లలోపు ప్రతి పంచాయతీకి ఒక పీఏసీఎస్, డైరీ ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు.