ప్రధాని మోడీని కొంగుకు కట్టేసుకుంది

ప్రధాని మోడీని కొంగుకు కట్టేసుకుంది

మామూలుగా చీరలంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రెండుకు తగ్గట్ఠుగా డిజైన్స్ తీసుకువస్తూ అట్రాక్ట్ చేస్తారు వ్యాపారులు. ఈ క్రమంలోనే ఇటీవల బాహుబలి చీరలు అంటూ వెరైటీ డిజైన్లు షాపుల్లో కనిపించాయి. సినిమానే కాకుండా.. మొన్న జరిగిన పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్ల ఫొటొలతోనూ చీరలపై ప్రింట్ వేశారు. అవి కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. పుల్వామా దాడికి రివేంజ్ చూపించిన సర్జికల్ స్ట్రైక్-2 ప్రపంచంలోనే హాట్ టాపిక్ అయ్యింది.

ఈ దాడి చేయడంలో ప్రధాని మోడీ పాత్ర కీలకం అయ్యింది. ఉగ్రవాదులను ఏరిపారేయండి అని మోడీ ఇచ్చిన ఆదేశంతోనే సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అయ్యిందని దేశ వ్యాప్తంగా ప్రధానిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ఊపులో మోడీతో వ్యాపారం చేస్తున్నారు చీరల వ్యాపారులు. మోడీ చీరలు మార్కెట్లోకి వచ్చాయి. చీరలపై మోడీ ప్రింట్ ఉండటంతో మహిళలు ఉత్సాహంగా కొంటున్నారట. మోడీపై ఉన్న అభిమానంతో  చీరలోనే మోడీని చూసుకుంటూ మురిసిపోతున్నారు మహిళలు. ప్రస్తుతం మోడీ చీరలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోడీని కొంగుకు కట్టేసుకుంది అంటూ జోక్స్ వేస్తున్నారు నెటిజన్లు.

narendra-modi-sarees-photos-viral