అంబేద్కర్ స్పూర్తితో పాలన సాగిస్తున్నాం : మోడీ

అంబేద్కర్ స్పూర్తితో పాలన సాగిస్తున్నాం : మోడీ

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో పాలన సాగిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు అండగా ఉన్నామన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే చౌయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగారన్నారు. యూపీలోని అలీఘర్ ఎన్నికల సభలో పాల్గొన్న మోడీ.. బీజేపీతోనే దేశ భద్రత సేఫ్ గా ఉంటుందన్నారు.

ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అంటే విపక్షాలకు వణుకెందుకని ప్రశ్నించారు ప్రధాని మోడీ. జమ్ముకశ్మీర్ కతువా బహిరంగ సభలో మాట్లాడారు. జలియన్ వాలా బాగ్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్న కార్యక్రమానికి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ గైర్హాజరయ్యారని, కాంగ్రెస్ నేతలతో మాత్రం కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. ఇదే దేశభక్తికి, పరివార్ భక్తికి తేడా అన్నారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనకపోవడం ద్వారా అమరీందర్ సింగ్ అమరులను కించపరిచారని ఆరోపించారు మోడీ. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని, దేశం మాత్రం ఎప్పటికీ ఉంటుందన్నారు. అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలతో జమ్ముకశ్మీర్ లోని 3 తరాలు నాశనమయ్యాయన్నారు మోడీ.