న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10 నుంచి 12 వరకు గుజరాత్ లో పర్యటించనున్నారు. శనివారం సోమనాథ్ కు ఆయన చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సోమనాథ్ ఆలయంలో నిర్వహించే ఓంకారం మంత్రజపం కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.
ఆదివారం ఉదయం 10.15 గంటలకు ఆలయంలో నిర్వహించే వివిధ పూజలతో పాటు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ శౌర్యయాత్రలోనూ ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా 108 గుర్రాలను ఊరేగిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మోదీ రాజ్ కోట్కు బయల్దేరతారు.
అక్కడ నిర్వహించే వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్‌లో ట్రేడ్ షో, ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం రాజ్‌కోట్ నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరతారు.
అదేరోజు సాయంత్రం మహాత్మా మందిర్ మెట్రో స్టేషన్లో అహ్మదాబాద్ మెట్రో రెండో దశను ప్రారంభిస్తారు. 12న జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్ రిక్ మెర్జ్‌తో మోదీ భేటీ అవుతారు.
