రైతుల ఆదాయాన్ని పెంచేందుకే అగ్రి చట్టాలు తెచ్చాం

రైతుల ఆదాయాన్ని పెంచేందుకే అగ్రి చట్టాలు తెచ్చాం

న్యూఢిల్లీ: రైతుల శ్రేయస్సు కోసమే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 1.75 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1.15 లక్షల కోట్లను డిపాజిట్ చేశాం. అన్నదాతల ఆదాయాన్ని పెంచడంతోపాటు వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రధాని మోడీకి స్పష్టమైన విజన్ ఉంది. రైతులు సుసంపన్నంగా ఉంటేనే దేశ ఎకానమీ కూడా పరుగులు పెడుతుంది. ఇక, కొత్త అగ్రి చట్టాల గురించి చెప్పాల్సి వస్తే.. ఇవి విప్లవాత్మకమైనవి’ అని తోమర్ చెప్పారు.