రైతులు ఆందోళనలు కొనసాగించడంలో అర్థం లేదు

రైతులు ఆందోళనలు కొనసాగించడంలో అర్థం లేదు

మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన తర్వాత కూడా రైతులు తమ ఆందోళనను కొనసాగించడంలో అర్థం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ప్రధాని మోడీ ఒక కమిటీని ఏర్పాటుచేశారని ఆయన తెలిపారు. రైతులు పంట వ్యర్థాల్ని తగులబెట్టడం కూడా నేరం కాదని కేంద్రం అంగీకరించినట్లు తోమర్ తెలిపారు.

‘వ్యవసాయంపై ప్రధాని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, కనీస మద్ధతు ధరలో పారదర్శకత వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేస్తుంది. కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారు. ఈ చర్యతో రైతుల కనీస మద్ధతు ధర డిమాండ్ కూడా నెరవేరింది. పంట వ్యర్థాలు తగులబెట్టడాన్ని నేరరహితంగా పరిగణించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరించింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన తర్వాత రైతులు తమ ఆందోళనను కొనసాగించడంలో అర్థం లేదు. రైతులు తమ ఆందోళనను ముగించి ఇంటికి వెళ్లాలని కోరుతున్నాను. నిరసన సమయంలో నమోదైన కేసుల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది.. వారు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానం ప్రకారం పరిహారం విషయంలో కూడా నిర్ణయం తీసుకోవచ్చు’ అని కేంద్ర మంత్రి తోమర్ అన్నారు.

For More News..

బిడ్డ ఒక్కసారి ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది

పెళ్లి జరుగుతుండగానే దొంగతనం