బిడ్డ ఒక్కసారి ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది

బిడ్డ ఒక్కసారి ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది

నోటిఫికేషన్స్, ఉద్యోగాలు రాక.. పురుగులమందు తాగుడం, ఉరేసుకోవడమే ఉద్యోగంగా రోజుకొక నిరుద్యోగి చస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కేసీఆర్ బిడ్డ ఒక్క ఎన్నికలో ఓడిపోతేనే ఆయన గుండె తల్లడిల్లిందని ఆమె అన్నారు. ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా.. కేసీఆర్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదని ఆమె మండిపడ్డారు.

‘బిడ్డ ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది. బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీగా ఉన్నాడు. నోటిఫికేషన్స్ లేక, ఉద్యోగాలు రాక పురుగులమందు తాగుడు, ఉరి వేసుకొనుడే ఉద్యోగంగా.. రోజుకొక్క నిరుద్యోగి చస్తుంటే మాత్రం దొరకు కనపడుతలేదు.

ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా.. నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదు దొరకు. నిరుద్యోగులను బలితీసుకొంటున్న హంతకుడు కేసీఆర్. ఇంకెంత మందిని బలితీసుకుంటే ఉద్యోగాలు ఇస్తారు సారూ? నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా? వాళ్ళ ప్రాణాలు నీకు లెక్కలేదా?’ అని షర్మిల ట్వీట్ చేశారు.