మరో సినిమా స్టార్ట్ చేసిన యంగ్ హీరో నరేష్ అగస్త్య..హీరోయిన్ ఎవరంటే.?

మరో సినిమా స్టార్ట్ చేసిన యంగ్ హీరో నరేష్ అగస్త్య..హీరోయిన్ ఎవరంటే.?

నరేష్ అగస్త్య హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది.  చైతన్య  గండికోట దర్శకత్వంలో డా.ఎం రాజేంద్ర  నిర్మిస్తున్నారు.  శ్రేయ  రుక్మిణి హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌‌‌కు హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టగా, నటుడు రఘుబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. డైరెక్టర్ బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. మాజీ ఐఏఎస్ సునీల్ శర్మ, అతని భార్య షాలిని శర్మ మేకర్స్‌‌‌‌కి స్క్రిప్ట్‌‌‌‌ను అందజేశారు.  పలువురు సినీ ప్రముఖులు, మూవీ టీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ చిత్రానికి డీవోపీగా విద్యాసాగర్ చింతా, ఎడిటర్‌‌‌‌‌‌‌‌గా కోటగిరి వెంకటేశ్వరరావు వర్క్ చేస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం,  లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందిస్తున్నారు.  త్వరలోనే  ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.  చిత్రానికి సంబంధించిన  ఇతర నటీనటుల  వివరాలు త్వరలోనే  తెలియజేస్తామన్నారు మేకర్స్.