టీకా విషయంలో రాజకీయాలు అవసరమా?

టీకా విషయంలో రాజకీయాలు అవసరమా?

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ డోసులు మరింతగా కావాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరడంపై సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ సీరియస్ అయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న ఈ సమయంలో ఎక్కువ టీకాలు ఇవ్వమని అడగడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి టైమ్ లో సంకుచిత రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో హర్షవర్ధన్ భేటీ అయ్యారు. ఆయా స్టేట్స్ లో కరోనా పరిస్థితిపై వారితో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆరు రాష్ట్రాల అధికారులు మరిన్ని టీకా డోసులు పంపమనడంతో హర్ష వర్ధన్ ఫైర్ అయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోందని తెలిపారు. టీకా తయారీదారులతో నేరుగా సంప్రదింపులు జరిపి డోసులు తెచ్చుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పిస్తున్నామని, ఈ దిశగా యత్నించాలని కోరారు.