షర్మిల పాదయాత్ర వెనుక కుట్ర ఉంది: పెద్ది సుదర్శన్ రెడ్డి

షర్మిల పాదయాత్ర వెనుక కుట్ర ఉంది: పెద్ది సుదర్శన్ రెడ్డి

YS షర్మిల పాదయాత్ర వెనుక పెద్ద కుట్ర ఉందని నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తన అన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రజా సమస్యలు లేవా...? ఇక్కడికి వచ్చి ఎందుకు పర్యటన చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర వెనుక అంతర్గతంగా కుట్ర దాగి ఉందన్నారు. షర్మిల టీఆర్ఎస్ నేతలపై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదన్నారు. షర్మిల ఎక్కడికక్కడే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. 

షర్మిల అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖరాయడం వల్లే నర్సంపేట ప్రజల 70 ఏళ్ల కల ఆవిరైందన్నారు. గోదావరి జలాలు రాకుండా ఆపారు అది కుట్ర కాదా అని ప్రశ్నించారు.