ప్రగతి భవన్​కు నర్సాపూర్ ​పంచాయితీ

ప్రగతి భవన్​కు నర్సాపూర్ ​పంచాయితీ

హైదరాబాద్, వెలుగు: నర్సాపూర్​ ఎమ్మెల్యే టికెట్ ​పంచాయితీ ప్రగతి భవన్​కు చేరింది. సిట్టింగ్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డికి బదులుగా మహిళా కమిషన్​ చైర్ ​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డిని ఈ స్థానం నుంచి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ విషయం ఇప్పటికే ఆమెకు చెప్పి సెగ్మెంట్​లో పని చేసుకోవాల ని సూచించారు. దీంతో మదన్​రెడ్డి వర్గీ యులు ఆమెకు సహకరించడం లేదు. ఇండిపెండెంట్​గా పోటీ చేయాలని మదన్​రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.

టికెట్​ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, పోటీ చేసి తీరుతానని మదన్​రెడ్డి బహిరంగంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదన్​రెడ్డిని సీఎం కేసీఆర్​ప్రగతి భవన్​కు పిలిపించారు. అప్పటికే సునీతా లక్ష్మారెడ్డి అక్కడే ఉండటంతో మంత్రి హరీశ్​రావు సమక్షంలో వారితో కేసీఆర్ ​మాట్లాడారు. సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం పని చేయాలని, తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ ​హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.