- మంగళవారం మంజీరాలో వ్యక్తి గల్లంతు
- కొనసాగుతున్న గజ ఈతగాళ్ల గాలింపు చర్యలు
- ఆందోళనలో కుటుంబీకులు
బీర్కూర్, వెలుగు : మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన నర్సింలు (28) చేపలు పట్టేందుకు వెళ్లి మంగళవారం సాయంత్రం మంజీరాలో గల్లంతయ్యాడు. 60 గంటలపాటు గజ ఈతగాళ్లు గాలిస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది శనివారం ఆదివారం వరకు గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం మళ్లీ వెతుకుతామని అధికారులు తెలిపారు. మంజీరా ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ముళ్ల పొదలకు తట్టుకున్నాడా.. కొట్టుకుని పోయాడా అని అధికారులు భావిస్తున్నారు. నర్సింలు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. తండ్రి రెండేండ్ల కింద మృతి చెందగా, తల్లి సాయవ్వ మానసికంగా బాధలో ఉన్నారు. తన భర్తను వెదికి ఇవ్వాలని భార్య పూజ కన్నీటిపర్యంతమవుతోంది.
