
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను విచారిస్తామని నార్సింగ్ సీఐ హరి కృష్ణా రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ మధ్యాహ్నం రాయదుర్గం పీఎస్ నుంచి తమకు జీరో ఎఫ్ఐఆర్ వచ్చిందని చెప్పారు. లైంగికంగా వేధించాడని జానీ మాస్టర్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై కేసు నమోదుచేశామని తెలిపారు. యువతి స్టేట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ..తను ప్రస్తుతానికి హైదరాబాద్ లో లేదన్నారు సీఐ హరికృష్ణారెడ్డి. యువతి ఇచ్చిన స్టేట్మెంట్, ఆధారాలతో జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ALSO READ | Jani Master: జానీ మాస్టర్ మంచి ఆటగాడే..ఎఫ్ఐఆర్లో ఏముందంటే..
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదయిన సంగతి తెలిసిందే.. జానీ మాస్టర్ పై మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కొరియాగ్రఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారంతో పాటు తనను శారీరకంగా.. మానసికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376, 506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.