
18 మంది నాసా టీమ్‌లో రాజా చారి
వాషింగ్టన్: ఇండియన్ – అమెరికన్ చందమామపై కాలు మోపనున్నాడు. మానవ సహిత మూన్ మిషన్ ‘ఆర్టిమిస్’ కోసం 18 మందితో కూడిన టీమ్‌ను అమెరికా స్పేస్ రిసెర్చ్ సెంటర్ నాసా ప్రకటించింది. ఆ టీమ్‌లో ఇండియన్ –అమెరికన్ రాజా జాన్ పర్పుత్తూర్ చారి కూడా ఉన్నారు. ఎంపికైన వాళ్లంతా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. 18 మందిలో సగం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 43 ఏండ్ల చారి యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఎమ్‌ఐటీ, యూఎస్ నావల్ టెస్ట్ పైలెట్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2017లో నాసా ఆస్ట్రొనాట్ క్యాండిడేట్ క్లాస్‌కు సెలెక్ట్ అయ్యారు. అదే ఏడాది ఆగస్టులో ఇనిషియల్ ఆస్ట్రొనాట్ క్యాండిడేట్ ట్రైనింగ్‌ను స్టార్ట్ చేసి.. ఇప్పుడు మిషన్ అసైన్‌మెంట్‌కు సెలెక్ట్ అయ్యారు. ఈ 18 మంది టీమ్ చాలా ప్రత్యేకతలతో కూడినదని నాసా చెప్పింది. ఈ యాత్ర సక్సెస్ అయితే చంద్రుడిపై ఓ మహిళ కాలుమోపడం ఇదే మొదటిసారి అవుతుందని సంస్థ చెప్పింది.