టెక్నికల్ ఇష్యూ...ఆగిన ఆర్టెమిస్‌ 1 ప్రయోగం

టెక్నికల్ ఇష్యూ...ఆగిన ఆర్టెమిస్‌ 1 ప్రయోగం

నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ 1 ప్రయోగం ఆగిపోయింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌లో RS-25 ఇంజిన్ పనిచేయలేదు. దీంతో  కౌంట్‌డౌన్ గడియారాన్ని నాసా నిలిపివేసింది. ఆ తర్వాత టెక్నికల్ సమస్య కారణంగా ప్రయోగించలేకపోయామని పేర్కొంది. ఆర్టెమిస్‌-1 ప్రాజెక్టులో భాగంగా అమెరికా స్పేస్ సెంట‌ర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంట‌ర్ నుంచి  ఈ ప్రయోగం జరగాల్సి ఉంది.

RS-25 ఇంజిన్ ప్రయోగానికి ముందు  కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్, ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయాలి.  అయితే టీమ్ ఇంజనీర్‌లు ఇంజిన్‌లలో ఒకదానిలో ఆశించిన విధంగా బ్లీడ్ కాలేదు. దీన్ని  గమనించిన ఇంజనీర్లు.. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ముందు కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్‌ డైరెక్టర్‌తో చర్చించినట్లు తెలిపింది. అయితే ఈ సమయంలో ప్రయోగంపై సస్పెన్స్ నెలకొంది. చివరకు వాయిదా వేస్తూ నాసా నిర్ణయం తీసుకుంది. 

చంద్రుడిపై శాశ్వత ఆవాసం కోసంం..
అపోలో రాకెట్ తర్వాత చంద్రుడిపైకి నాసా ఆర్టెమిస్ 1ను ప్రయోగిస్తోంది. గతంలో కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేయాలని నాసా ప్లాన్.  ఆర్టెమిస్‌-1 ప్రయోగంలో భాగంగా అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం నిర్వహిస్తోంది. ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా..  ఆర్టెమిస్‌-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి.