చంద్రయాన్ 3 సక్సెస్.. ఇస్రోకు నాసా అభినందనలు

చంద్రయాన్ 3 సక్సెస్.. ఇస్రోకు నాసా అభినందనలు

చంద్రయాన్ 3 సక్సెస్ తో  చరిత్రలో భారత్ కొత్త అధ్యాయనం లిఖించింది. చంద్రుడి  దక్షిణ దృవంపై  ల్యాండ్ అయిన ఫస్ట్ దేశంగా చరిత్రకెక్కింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతున్నారు. 

చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ చేయడంతో   US నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం ఇస్రో( ISRO) చారిత్రాత్మక విజయానికి అభినందనలు తెలిపింది.

చంద్రయాన్-3 చంద్ర సౌత్ పోల్ ల్యాండింగ్‌ అయ్యినందుకు NASA అడ్మినిస్ట్రేటర్ బిల్  నెల్సన్  అభినందనలు తెలిపారు. అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన 4వ దేశంగా భారతదేశానికి అభినందనలు.  ఈ మిషన్‌లో భారత్ కూడా భాగస్వామి అయినందుకు తాము సంతోషిస్తున్నామని ట్వీట్ చేశారు.