నాసా పోటీలో మనవాళ్లు దుమ్ములేపారు

నాసా పోటీలో మనవాళ్లు దుమ్ములేపారు
  • ‘రోవర్‌ చాలెంజ్‌ ’లోమన స్టూడెంట్ల సత్తా
  • దేశం నుంచి మూడు బృందాలకు ప్రైజ్‌ లు
  • స్కూళ్ల విభాగంలో జర్మనీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌.. కాలేజీల్లో పోర్టోరికో

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహిం చిన ‘రోవర్‌ చాలెంజ్‌‌‌‌‌‌‌‌’ పోటీలో ఇండియన్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు సత్తా చాటారు. వివిధ దేశాలనుంచి 100 బృందాలు పాల్గొన్న ఈ పోటీలో ఉత్తరప్రదేశ్‌ , మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్ల బృందాలు బహుమతులు గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని ఘాజియాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన కైట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌స్టి ట్యూషన్స్‌ కు ‘ఏఐఏఏ నీల్‌‌‌‌‌‌‌‌ ఆర్మ్‌‌‌‌‌‌‌‌స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌బె స్ట్‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌’ అవార్డు దక్కింది. రోవర్‌ చాలెంజ్‌‌‌‌‌‌‌‌ పెర్ ఫార్మెన్స్‌ విభాగంలో ఈ ప్రైజ్‌‌‌‌‌‌‌‌ పొందింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ముఖేశ్‌ పటేల్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌టెక్నాలజీ మేనేజ్‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌కు ‘ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌ జోయ్‌ సెక్స్‌టన్‌‌‌‌‌‌‌‌ మెమోరియల్‌‌‌‌‌‌‌‌ పిట్‌‌‌‌‌‌‌‌ క్రూ’ అవార్డు వచ్చింది. రోవర్‌ ముందుకెళ్తున్నప్పుడు వచ్చే సమస్యలను అధిగమించినందుకు గాను ఈ బహుమతి గెలుచుకుంది.

దీంతోపాటు ‘సిస్టమ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ చాలెంజ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు కూడా బృందాన్ని వరించిం ది. పంజాబ్‌ లోని లవ్లీ ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ బృందం ‘స్టెమ్‌‌‌‌‌‌‌‌ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అవార్డు’ను గెలుచుకుంది. రాకెట్రీ, స్పేస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఇతర వివరాలను ఈజీగా వివరించినందుకు ఈ బహుమతి పొందింది. స్కూళ్ల విభాగంలో జర్మనీకి చెందిన ఇంటర్నేష నల్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ ఎడ్యు కేషన్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌స్టి ట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లెయ్‌ప్జిగ్‌‌‌‌‌‌‌‌ 91 పాయింట్లతో తొలి ప్రైజ్‌‌‌‌‌‌‌‌ పొందింది. కాలేజీలు, యూనివర్సిటీల విభాగంలో పోర్టోరికో మయగుయెజ్‌‌‌‌‌‌‌‌ 101 పాయింట్లలో తొలిస్థానంలో నిలిచింది. యూఎస్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ అండ్‌ రాకెట్‌‌‌‌ సెంటర్‌ లో నాసా కు చెందిన మార్షల్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ సెంటర్‌ ఈ పోటీలు నిర్వహించింది. రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ అమెరికన్‌‌‌‌‌‌‌‌, నాసా ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌ సునీతా విలియమ్స్‌ కార్యక్రమం రెండో రోజు హాజరయ్యారు. స్టూడెంట్లతో మాట్లాడారు.

కృత్రిమ పరిస్థితులు సృష్టించి..

2024లో చంద్రునిపైకి రోవర్‌ ను పంపేం దుకు నాసా సిద్ధమవుతోంది. అందులో భాగంగా అవాంతరాలను తట్టుకొని ముందుకెళ్లగలిగే రోవర్ల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా హైస్కూళ్లు, కాలేజీ స్టూ డెంట్లను ఆహ్వానించింది. మార్స్‌ , చంద్రుడు, ఇతర గ్రహాలపై ఉన్న పరిస్థితులను, అవాంతరాలను కృత్రిమంగా సృష్టించింది. పోటీలో భాగంగా స్టూ డెంట్లు సొంతంగా తయారు చే సిన రోవర్లను సుమారు 1.2 కిలోమీటర్ల మేర నడిపించాలి. అవాంతరాలను దాటుకొని లక్ష్యాన్ని చేరు కునే స్థాయిని బట్టి పాయింట్లు ఇచ్చారు. అమెరికా, బంగ్లా దేశ్‌ , బొలీవియా, బ్రెజిల్‌‌‌‌‌‌‌‌, ఈజిప్టు,ఇథియోపియా, జర్మనీ, మెక్సి కో, మొరాకో, పెరు తదితర దేశాలు పోటీలో పాల్గొన్నాయి.