
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ఓ అద్భుతమైన వీడియోని రిలీజ్ చేసింది. గంటకు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే జూనో స్పేస్‌క్రాఫ్ట్ ఈ వీడియోను చిత్రికరించింది. ఇన్‌స్ట్రాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనో మిషన్‌కు చెందిన కెమెరాలు ఏప్రిల్ 9వ తేదీన సుమారు 32000 కిలోమీటర్ల దూరం నుంచి గురుగ్రహాన్ని షూట్ చేశాయి. బృహస్పతికి చెందిన దక్షిణ ద్రువాన్ని ఈ వీడియోలో షూట్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గురుగ్రహానికి మరింత దగ్గరగా జూనో వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.