గ్రహశకలాన్ని ఢీకొన్న నాసా అంతరిక్ష నౌక

గ్రహశకలాన్ని ఢీకొన్న నాసా అంతరిక్ష నౌక

భూమిపైకి దూసుకొచ్చిన గ్రహశకలాన్ని నాసా ఏ రకంగా ధ్వంసం చేస్తుందనే కథాంశంతో రూపొందించిన హాలీవుడ్ మూవీ- ఆర్మగెడాన్. బ్రూస్ విల్లీస్ హీరోగా1998లో వచ్చిన ఈ మూవీని నాసా ఇప్పుడు నిజం చేసింది. అంతే కాదు దీంతో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష నౌకను ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన డార్ట్ (డీఏఆర్‌టీ) స్పేస్‌క్రాఫ్ట్‌.. గంటకు 2,250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించి వీడియోను నాసా షేర్ చేసింది.  గ్రహశకలాన్ని ఢీకొట్టడంతో శాస్త్రవేత్తలు చెందిన అనుభూతని ఈ వీడియోలో భద్రపరిచారు. అయితే భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను నాశనం చేసే ఉద్దేశ్యంతో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. ఇలా అంతరిక్ష నౌక ఢీకొట్టడంతో గ్రహశకలం గమనంలో ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని, కొంత సమయం పడుతుందని వాళ్లు తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను అంతరిక్షంలోనే పక్కకు మళ్లించవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా వేస్తు్న్నారు.

1,260-పౌండ్ల బరువు ఉన్న డబుల్ ఆస్టరాయిడ్ రీ-డైరెక్షన్ టెస్ట్ (డార్ట్) స్పేస్‌క్రాఫ్ట్ ఈ తెల్లవారు జామున 4:40 నిమిషాలకు ఆ గ్రహశకలాన్ని ఢీ కొట్టింది. భూ ఉపరితలం నుంచి ఏడు మిలియన్ మైళ్ల దూరంలో... గంటకు 14,000 మైళ్ల వేగంతో ఆ స్పేస్‌క్రాఫ్ట్ డైమోర్ఫస్ అస్టరాయిడ్‌ను ఢీకొట్టింది. ఈ గ్రహశకలం బరువు 11 బిలియన్ పౌండ్లు కాగా.. 520 అడుగుల పొడవుండే ఈ అస్టరాయిడ్ సెంటర్ పాయింట్‌కు దాదాపు 55 అడుగుల దూరంలో గల ప్రాంతాన్ని నాసా డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టింది.