
- పలువురిపై దాడి, పలు వాహనాల ధ్వంసం
ఎల్బీ నగర్, వెలుగు: ఓ రౌడీషీటర్ కత్తి చేతిలో పట్టుకుని నానా హంగామా సృష్టించాడు. కనిపించిన వారిపై దాడికి దిగాడు. తన ముందున్న వాహనాలను కత్తితో బలంగా కొడుతూ ధ్వంసం చేశాడు. అడ్డు వస్తే చంపేస్తానంటూ అరిచాడు. ఈ ఘటన ఐఎస్ సదన్ నెహ్రూనగర్ కాలనీలో బుధవారం జరిగింది.
నసీర్ అనే రౌడీషీటర్ కత్తి పట్టుకుని వీధుల్లోకి వచ్చాడు. తనకు కనిపించిన పలువురిపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న టూవీలర్లు, కార్లను కత్తితో కొడుతూ, కింద పడేస్తూ హల్చల్ చేశాడు. పోలీసులకు అక్కడికి చేరుకోగానే వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. రౌడీషీటర్ కోసం వెతుకుతున్నామని, ఆయన చేతిలో గాయాలపాలైన వారిని హాస్పిటల్కు తరలించామని పోలీసులు తెలిపారు.