ఆడవాళ్లు సంసారానికే పనికొస్తారు.. సీపీఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆడవాళ్లు సంసారానికే పనికొస్తారు.. సీపీఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేత ఒకరు మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ఆడోళ్లు భర్తలతో సంసారం చేయడానికి మాత్రమే ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సీపీఎం నేత సయ్యద్ అలీ మజీద్.. విజయోత్సవ ర్యాలీలో అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. థెన్నెలా పంచాయతీ వార్డుకు పోటీ చేసిన మజీద్ 47 ఓట్ల తేడాతో గెలిచారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ నుంచి గెలిచిన మజీద్ 666 ఓట్లు సాధించారు.

పెళ్లి చేసుకుని అత్తింటికి వచ్చే మహిళలను ఓట్ల కోసం అపరిచితుల ముందుకు తీసుకురావొద్దని.. తనను ఓడించడానికి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని ప్రత్యర్థులపై మజీద్ విమర్శలు చేశారు. ఆడవాళ్లు భర్తతో సంసారం చేయడానికే పనికొస్తారని మజీద్ చేసిన వ్యాఖ్యలు కేరళలో రాజకీయంగా పెను దుమారం రేపాయి. మహిళా సంఘాలు, ప్రత్యర్థి పార్టీలు మజీద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. మజీద్ తన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.