ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవం.. అందుకునేది వీళ్ళే

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవం..  అందుకునేది వీళ్ళే

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవి జాతీయ అవార్డులు(National Awards). ఈ ఏడాదికి గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం రేపు(అక్టోబర్ 17) జరగబోతుంది. విజేతలుగా నిలిచిన వారి లిస్టును కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. 

వాటిలో ప్రతీ ఇండస్ట్రీ నుండి బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలన్నీ అవార్డుల కోసం పోటీలో నిలవగా.. వీటిలో కొన్ని మాత్రమే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకున్నాయి. రేపు అనగా అక్టోబర్ 17 మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ(Delhi)లోని విజ్ఞాన్ భవన్‌(Vigyan bhavan)లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఈ అవార్డులను అందజేయనున్నారు. ఈ అవార్డుల వేడుక నిమిత్తం టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో ఢిల్లీకి బయలుదేరారు. ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక రేపు(అక్టోబర్ 17) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకునే వారి జాబితా ఇలా ఉంది:

  • ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప)
  • ఉత్తమ నటి : ఆలియా భట్ (గంగూబాయి), కృతిసనన్ (మిమీ)
  • ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి (ది కశ్మీరీ ఫైల్స్ – హిందీ)
  • ఉత్తమ సహాయ నటుడు : పంకజ్ త్రిపాఠీ (మిమీ – హిందీ)
  • ఉత్తమ దర్శకుడు : నిఖిల్ మహాజన్ (గోదావరి – మరాఠీ సినిమా)
  • ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌) : దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
  • ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌) : ఎమ్.ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్)
  • బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం : రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
  • ఉత్తమ పిల్లల చిత్రం : గాంధీ అండ్ కో (గుజరాతీ)
  • ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ : ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
  • ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)
  • బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ – తమిళ మూవీ)
  • బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో)
  • ఉత్తమ లిరిక్స్‌ : చంద్రబోస్ (కొండపొలం – తెలుగు)
  • ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ) : కింగ్ సోలమన్ (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్ – హిందీ)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : దిమిత్రీ మాలిక్, మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
  • ఉత్తమ ఎడిటింగ్‌ : సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి)
  • బెస్ట్‌ ఆడియోగ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌) : అరుణ్ అశోక్, సోనూ కేపీ (చవిట్టు – మలయాళం)
  • బెస్ట్‌ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌) : అనీష్ బసు (జీలీ – బెంగాలీ)
  • బెస్ట్‌ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్‌ ఆఫ్‌ ది ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌) : సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్ – హిందీ)
  • బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) : షాహీ కబీర్ (నాయట్టు – మలయాళం)
  • బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (డైలాగ్‌ రైటర్‌) : ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి – హిందీ)
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్)
  • ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ సినిమా)
  • బెస్ట్‌ ఫిలిం ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ కంజర్వేషన్‌ : అవషావ్యూహం (మలయాళం)
  • బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌ : అనునాద్ ది రెజోనెన్స్ (అస్సామీస్)
  • బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ : ఆర్ఆర్ఆర్
  • ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌ : మెప్పాడియన్ (మలయాళం)
  • స్పెషల్ జ్యూరీ అవార్డ్ : షేర్ షా (హిందీ సినిమా)
  • నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ : ది కశ్మీరీ ఫైల్స్ (హిందీ)