
హైదరాబాద్,వెలుగు: సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ బెస్ట్ టీచర్అవార్డు–2024కు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన కూరాకుల శ్రీనివాస్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సౌత్ ఇండియా బహుజన రైటర్స్ ఏడో తెలంగాణ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్రమణియన్,స్టేట్ ప్రెసిడెంట్ ఎంఎం గౌతమ్ లు శ్రీనివాస్‌కు అవార్డును అందించారు.
అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తాము ఏటా ఉద్యమకారులు, సంఘసేవకులకు అవార్డులను అందిస్తున్నట్టు చెప్పారు. నేషనల్ అవార్డు పొందడంపై సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు స్థితప్రజ్ఞ, శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ మ్యాన పవన్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.