ముగిసిన నేషనల్ బుక్ ఫెయిర్

ముగిసిన నేషనల్ బుక్ ఫెయిర్

హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో 35వ నేషనల్ బుక్ ఫెయిర్ ముగిసింది. చివరి రోజు కావడంతో పబ్లిక్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. కరోనా కారణంగా గత రెండేళ్లలో బుక్ ఫెయిర్ కు ఆదరణ తగ్గినా.. ఈసారి పబ్లిక్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. లక్షల్లో బుక్స్ సేల్ అయ్యాయి. 11 రోజుల పాటు సాగిన బుక్ ఫెయిర్ కు 10 లక్షల మందికి పైగా విజిటర్స్ వచ్చారు. లక్షల్లో బుక్స్ సేల్ అయ్యాయి. 

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 21న  ప్రారంభమైన 35వ నేషనల్ బుక్ ఫెయిర్ ఇవాళ్టితో ముగిసింది. ఇవాళ చివరి రోజు కావడంతో పబ్లిక్ పెద్దసంఖ్యలో వచ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా బుక్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో చివరి రోజు కూడా భారీగా బుక్స్ అమ్ముడయ్యాయి. 
నేషనల్ బుక్ ఫెయిర్ లో 340 స్టాల్స్  ఏర్పాటు చేశారు. అన్ని స్టాల్స్ లోనూ దాదాపు 10 లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచారు.   ప్రారంభించిన మొదటి రోజు నుంచే బుక్ ఫెయిర్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. పుస్తక ప్రదర్శనను నాలుగు రోజుల్లోనే 3 లక్షల మంది విజిట్ చేశారు. రకరకాల బుక్స్ కొనేందుకు జనం తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా పక్కరాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. 
బుక్ ఫెయిర్ లో అన్ని రకాల బుక్స్ కు డిమాండ్ పెరిగింది. బయటి మార్కెట్ కంటే బుక్ ఫెయిర్ లో తక్కువ ధరలు ఉండడంతో సేల్స్ పెరిగాయి. యవత ఎక్కువగా మోటివేషన్ బుక్స్ పై ఇంట్రెస్ట్ చూపించారు. చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లకు బదులుగా పుస్తకాలను చదివించాలనే ఉద్దేశ్యంతో కథలతో కూడిన బుక్స్ ను తల్లిదండ్రులు ఎక్కువగా కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. 

పుస్తక ప్రియులు మాత్రం అన్ని స్టాల్స్ తిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేశారు. అయితే  తెలుగు బుక్స్ ప్రింటింగ్ తగ్గిందని పబ్లిషర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లైబ్రైరీలకు బుక్స్ సప్లై చేయడం మానేయటంతో సేల్స్ తగ్గాయని వాపోయారు. ప్రింటింగ్ ఖర్చులు పెరగడంతో బుక్స్ ధరలూ పెరిగాయి. దీంతో ధర ఎక్కువ ఉన్న బుక్స్ ను కొనేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపలేదని పబ్లిషర్స్ చెబుతున్నారు. గత రెండేళ్లతో పోల్చితే మాత్రం సేల్స్ పెరిగాయన్నారు.  లక్షలాది మంది విజిట్ చేసిన బుక్ ఫెయిర్ లో వసతులు సరిగ్గా లేవని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 340 స్టాల్స్ ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ లో.. కేవలం పది టాయిలెట్లు ఏర్పాటు చేయటంతో జనం ఇబ్బందులుపడ్డారు.