జమ్మూకశ్మీర్ ఎన్నికలు: నేషనల్ కాన్ఫరెన్స్ 51 ..కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ

జమ్మూకశ్మీర్ ఎన్నికలు: నేషనల్ కాన్ఫరెన్స్  51 ..కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ

జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 51చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 32స్థానాల్లో బరిలోకి దిగనుంది. మరో రెండు సీట్లను కూటమిలో భాగంగా ఉన్న సీపీఐఎం, పాంథర్స్ పార్టీకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. మరో ఐదు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు. శ్రీనగర్ లోని NCచీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో  సీట్ల పంపకంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ తరుఫున ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియార్ నేత సల్మాన్ ఖుర్షీద్ చర్చల్లో పాల్గొన్నారు. ఎన్సీ తరుఫున ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

ALSO READ | కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం లద్దాఖ్‍లో ఐదు కొత్త జిల్లాలు

మరో వైపు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు బీజేపీకి పెద్దసమస్యగా మారింది. ఫస్ట్, సెకండ్ లిస్టులలో టిక్కెట్లు దక్కని నాయకుల అనుచరులు ఆందోళనకు దిగారు. ఎన్నో ఎళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న తమను కాదని.. రెండ్రోజుల క్రితం పార్టీలో చేరినవారికి టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. బీజేపీ అభివృద్ధికి పాటుపడినవారికి టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ.. జమ్ములోని బీజేపీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. దీంతో జమ్ములోని కాషాయ పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.