మీరు చాలా గ్రేట్: యూట్యూబర్ కాళ్లు మొక్కిన మోదీ

మీరు చాలా గ్రేట్: యూట్యూబర్ కాళ్లు మొక్కిన మోదీ

జాన్వీ సింగ్..మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డు అందుకున్న యువతి. ప్రధాని మోదీ చేతుల మీదుగా న్యూఢిల్లీ భారత్ మండపంలో జన్వీసింగ్ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును శుక్రవారం (మార్చి 8) అందుకున్నారు..ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ కాళ్లకుమొక్కిన జాన్వీ సింగ్ను మోదీ వద్దంటూనే..ఆయన కూడా ప్రతిగా కాళ్లు మొక్కారు. దేశ ప్రధానితో ప్రశంసలందుకున్న జాన్వీ .. యూ ఆర్ గ్రేట్.. అని నెటిజన్లు మెచ్చుకున్నారు. 

ఈ అవార్డు పొందిన వారిలో గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే, ఉత్తమ స్టోరీ టెల్లర్ గా కీర్తిగా గోవిందస్వామి, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గాయనీ మైథిలీ ఠాకూర్, టెక్ కేటగిరీలో ఉత్తమ క్రియేటర్ గా గౌరవ్ చౌదరి, ఫేవరేట్ ట్రావెల్ క్రియేటర్ గా  కమియా జానీ అవార్డులను అందుకున్నారు. 

స్టోరీ టెల్లింగ్ , సోషల్ చేంజ్ అడ్వకేసీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎడ్యుకేషన్ , గేమింగ్ తో సహా డొమైన్లలో గొప్పతనం, వాటి ప్రభావాన్ని గుర్తించి  సృజనాత్మకతను సానుకూలంగా మార్చుకునే లాంచ్ ప్యాడ్ గా  ఈ అవార్డును అందజేస్తున్నారు. 
ఈ అవార్డుల గురించి ప్రధాని మోదీ Xలో ఓ పోస్ట్ చేశారు.. ‘‘ మార్చి8 ఉదయం 10.30గంటలకు నేను మొట్ట మొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డును అందజేస్తాను. ఈ అవార్డులు ఆవిష్కరణ, సృజనాత్మకత , క్రియేటర్స్ స్ఫూర్తికి సంబంధించిన వేడుక’’ అని రాశారు. 

ALSO READ :- Rashmika Mandanna: యాక్షన్ కాదు రొమాన్స్ కావాలి.. రూమర్స్పై స్పందించిన రష్మిక

ఈ నేషనల్ క్రియేటర్ అవార్డులకు మొట్టమొదటి సారి 20 విభిన్న కేటగిరీలలో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు వచ్చాయి. ఓటింగ్ రౌండ్, వివిధ అవార్డుకేటగిరీల్లో డిజిటల్ క్రియేటర్స్ కు సుమారు 10 లక్షల ఓట్లు వచ్చాయి. ఇందులో ముగ్గరు అంతర్జాతీయ క్రియేటర్లతో  సహా 23 మంది విజేతలను ఎంపిక చేశారు.