జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యతను చాటాలి

జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యతను చాటాలి

ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లోని ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటిన మంత్రి తలసాని ... ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే  దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులు అని చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన  మహనీయుడు మహాత్మా అని గాంధీ సేవలను తలసాని కొనియాడారు. వజ్రోత్సవాలలో భాగంగా 75 ప్రాంతాల్లో ఫ్రీడమ్ పార్క్ లను ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసానితో పాటు రాజ్యసభ సభ్యులు K. కేశవరావు, MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగమే...

ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం అర్పితం చేసి మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీజీ లాంటి మాహాత్ములు అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం రావాడానికి వారు ఎంతో కృషి చేశారని తెలిపారు. భారత వజ్రోత్సవాలలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట్ డివిజన్ హైదరబస్తీలోని గ్రౌండ్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 75 మొక్కలు నాటారు. ఈ నెల 8 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తలసాని చెప్పారు. ఈ రోజు మనమంతా ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగమేనని అన్నారు. అంతే కాకుండా  ప్రతి రోజూ గాంధీ చిత్రాన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శిస్తున్నామని తలసాని స్పష్టం చేశారు.