నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా (NIGST SOI) యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టులు: 06.
పోస్టుల సంఖ్య: యంగ్ ప్రొఫెషనల్స్ 01, రీసెర్చ్ అసోసియేట్ 02, జూనియర్ రీసెర్చ్ ఫెలో 03.
ఎలిజిబిలిటీ
యంగ్ ప్రొఫెషనల్స్: ఎంబీఏ లేదా మేనేజ్మెంట్లో రెండేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ): జియోఇన్ఫర్మేటిక్స్, రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ డేటా సైన్స్, జియోడెసీ మొదలైన వాటిలో మాస్టర్స్ డిగ్రీతో జియోస్పేషియల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్): ఎంఎస్సీ,/ ఎం.టెక్/ ఎంఈ ( జియో ఇన్ఫర్మేటిక్స్ / రిమోట్ సెన్సింగ్ & జీఐఎస్ / జియోస్పేషియల్ ఇంజనీరింగ్). లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్)తో సహా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ -సీఎస్ఐఆర్ యూజీసీ నెట్లో అర్హత సాధించిన స్కాలర్లు అయి ఉండాలి.
వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్స్ 32 ఏండ్లు, రీసెర్చ్ అసోసియేట్ 35 ఏండ్లు, జేఆర్ఎఫ్లకు 30 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 11.
లాస్ట్ డేట్: డిసెంబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు surveyofindia.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
