నలుగురు నిషేధిత పీఎఫ్ఐ సభ్యుల ఆచూకీపై రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

నలుగురు నిషేధిత పీఎఫ్ఐ సభ్యుల ఆచూకీపై రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య కేసులో నిషేధిత నలుగురు పీఎఫ్‌ఐ సభ్యుల గురించి సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నగదు రివార్డు ప్రకటించింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లారే పట్టణంలో ప్రవీణ్ నెట్టార్ అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చ నాయకుడిగా పని చేస్తున్న ప్రవీణ్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. బీజేపీ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నాడు. అయితే బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో ప్రవీణ్ కోళ్ల అంగడి వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ప్రవీణ్ మీద దాడి చేశారు. తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటాడి, వెంటాడి వేటకొడవళ్లతో నరికి చంపేశారు. 

ఈ ఘటనపై అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మరికొందరు బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రవీణ్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఘటన అనంతరం విచారణ చేపట్టిన ఎన్ఐఏ.... ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితులు అప్పట్లో అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. తాజాగా నలుగురు నిషేధిత పీఎఫ్ఐ సభ్యులకు సంబంధించిన వివరాలతో పాటు.. వారి గురించి సమాచారం ఇచ్చినవారికి నగదు రివార్డు ఇస్తామని పేర్కొంది. ఎన్ఐఏ రిలీజ్ చేసిన ఈ ప్రకటనలో మహమ్మద్ ముస్తఫా, తుఫేల్ లపై 5లక్షలు, ఉమ్మార్ ఫరూక్, అబుబక్కార్ సిద్ధిక్ లపై 2లక్షలుగా తెలిపింది.