జమ్మూకశ్మీర్ లోని 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

జమ్మూకశ్మీర్ లోని 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

జమ్ము కశ్మీర్ లోని 14 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించింది. లష్కర్-ఇ-ముస్తాఫా చీఫ్ హిదయాతుల్లా అరెస్టు నేపథ్యంలో ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. పుల్వామా, సోఫియాన్, శ్రీనగర్, అనంతనాగ్, జమ్ము, బనిహాల్ ఏరియాల్లో సోదాలు ప్రారంభించాయి NIA టీమ్స్. మొత్తం రెండు ఉగ్రవాద కేసులకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో జమ్ము బస్టాండ్ లో IED రికవరీ చేసుకున్న కేసుతో పాటు LEM చీఫ్ హిదాయతుల్లా అరెస్టు కేసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 6న హిదయాతుల్లాను అనంత్ నాగ్ పోలీసులు కుంజ్వాని ఏరియాలో అరెస్టు చేశారు.